ప్రతినెలా 5లోగా జీతాలు ఇచ్చేస్తున్నాం: ఏపీ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
ప్రతినెలా 5లోగా జీతాలు ఇచ్చేస్తున్నాం: ఏపీ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
- By khaja --
- Sunday, 22 Jan, 2023
అమరావతి: 'రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం, కొవిడ్ పరిస్థితులవల్ల రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రతి నెలా 5వ తేదీ నాటికి 90-95% ఉద్యోగుల జీతాలు, పింఛన్లను ప్రభుత్వం చెల్లిస్తోంది. మిగిలిన 5% మందికి ఖజానాలో బిల్లులు సమర్పించిన తేదీకి అనుగుణంగా చెల్లింపులు జరుగుతున్నాయి. రిజర్వు బ్యాంకు, బ్యాంకుల సెలవులు, రాష్ట్రంలో నిధులు (వేస్ అండ్ మీన్స్- చేబదుళ్లు) అందుబాటులో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఈ చెల్లింపులు సాగుతున్నాయని వివరించారు. ఇంతకుముందు, ఇప్పుడు ఇదే పద్ధతి కొనసాగుతోందని తెలిపారు. khaja